
Health Tips: మన వంటగదిలో తరచూ కనిపించే వాము, కేవలం ఒక సాధారణ సుగంధ ద్రవ్యం కాదు. భారతీయ ఆహారంలో శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్న ఈ వాము.. రుచి పెంచడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆయుర్వేద గ్రంథాలే చెబుతున్నాయి. కూరలు, పప్పులు, పిండి వంటలు, స్నాక్స్ ఏ వంటలో వాము వేసినా అదనపు రుచి కలగడం సర్వసాధారణం. అయితే వాము గింజలు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి అమృతం వంటి ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో శరీర రక్షణ కోసం ఇవి అద్భుతమైన సహజ వైద్యం.
వామాకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండిఉంటాయి. చలికాలం మొదలయ్యే సరికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ప్రతి ఇంటిలో సాధారణమైపోతాయి. ఇలాంటి కాలంలో వామాకులు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాటిని రసంగా తయారుచేసుకుని తాగితే శరీరానికి తక్షణ ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
వామాకులతో రసం తయారు చేసే సులభ రెసిపీ ఎలాగంటే.. ముందుగా కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, నల్లమిరియాలు, ఎండుమిర్చిని స్వల్ప నూనెలో వేయిస్తూ బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత వీటిని చల్లబెట్టి టమాటా ముక్కలు, సన్నగా తరిమిన వామాకులు జోడించి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి నీరు జోడించి రెండు సార్లు మరిగించాలి. తర్వాత ఉప్పు, చింతపండు పేస్ట్ వేసి కలిపి మరోసారి మరిగించిన తర్వాత తాళింపు కోసం నెయ్యి, ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో తయారుచేసిన ఫ్లేవర్‌ను రసంలో పోయాలి. ఇలా తయారయ్యే వామాకుల రసం రుచికరంగానూ, ఆరోగ్యపరంగానూ అద్భుతంగా ఉంటుంది.
సాధారణంగా ఈ రసాన్ని వేడి వేడి అన్నంలోకి పోసుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది. అలాగే దీనిని సూప్‌లా తాగినా గొంతు నొప్పి, కఫం, గరగరం వంటి సమస్యలు వెంటనే తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలున్నవారికి, చలికి త్వరగా గురయ్యే వారికి వామాకుల రసం సహజ యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది.
వామాకుల రసం తరచుగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. వాములో ఉండే సహజ ఎంజైమ్స్ కడుపులో జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అందుకే జీర్ణసమస్యలు ఉన్నవారు ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించే సహజ ఔషధంలా కూడా ఈ రసం పనిచేస్తుంది. వాములో ఉండే విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యానికి అవసరమవుతుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకునేవారిలో చూపు మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా మన అందరికీ తెలిసిన వాము, వామాకులు ఆరోగ్య పరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని, చలికాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. క్రైమ్ మిర్రర్ దీనిని ధృవీకరించట్లేదు.
ALSO READ: Mass Warning: ఒక్కొక్కడి తోలు తీస్తా: కవిత





