హీరోయిన్ అనే రీజన్ తోనే నన్ను వదిలేశాడు : మృణాల్ ఠాకూర్

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తన గతంలోని లవ్ స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని.. ఆ రిలేషన్ కొద్ది కాలంలోనే బ్రేకప్ గా మారిపోయింది అని తెలిపారు. నేను నటిని కావడం వల్లే తన మాజీ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు అని మృణాల్ ఠాకూర్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కీలక విషయాలను వెల్లడించారు. “నువ్వు చాలా ఇంపల్సివ్ గా ఉంటావు.. కాబట్టి నేను దీన్ని హ్యాండిల్ చేయలేను” అంటూ బ్రేకప్ చెప్పాడు అని అన్నారు. అంతేకాకుండా చివరిలో నువ్వు ఒక హీరోయిన్.. కాబట్టి అది నాకు అసలు నచ్చదు అంటూ వదిలేసి వెళ్లిపోయాడు అని తెలిపారు. ఆ తర్వాత రియలైజ్ అయిన నేను ఈ రిలేషన్ షిప్ ముగిసిపోవడం నాకు మంచిదే అనుకుంటూ.. అందులో నుండి బయటకి వచ్చేసా.. లేదంటే భవిష్యత్తులో ఒకవేళ పెళ్లి చేసుకున్న ఇబ్బందులు వచ్చేవి అని మృణాల్ ఠాకూర్ అన్నారు. ఏది ఏమైనా కూడా అప్పటి రిలేషన్షిప్ కంటిన్యూ చేయకపోవడమే ఇప్పుడు మంచిదైంది అని ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలను పంచుకున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ధనుష్ మరియు ఈ హీరోయిన్ మధ్య పెళ్లి జరగబోతుంది అంటూ ఎన్నో ఫేక్ వార్తలు ప్రతి రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే హీరోయిన్ మృనాల్ టీం స్పందిస్తూ మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ మరోవైపు ఈ రూమర్స్ పై ధనుష్ మాత్రం అసలు స్పందించనే లేదు.

Read also : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

Read also : కెసి తండా చెరువులో ఇద్దరు చిన్నారులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button