తెలంగాణ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అతడు ఒక సైన్యం

చండూరు, కైమ్‌ మిర్రర్ :- ఠాగూర్ సీనిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. చిరంజీవి కోసం లక్షాలాధి మంది ప్రజలు, అభిమానులు వస్తారు. అపుడు పోలీసు ఆఫీసర్‌ అంటాడు ఓ వ్యక్తిని అభిమానిస్తే ఇంతాలా అభిమానిస్తారా అని. ఇది రీల్‌ కాని రియల్‌ లైఫ్‌లో కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. ముఖ్యంగా యువతకు ఆయన అంటే చాలా క్రేజ్‌. ఆయన వర్కింగ్‌ స్టెల్‌ కాని, నిస్వార్థకంగా చేసే సేవా కార్యక్రమాలకు ఎవరైనా ఇట్టే ఆయనకు అభిమానులు అవుతారు. ఇక విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభిమానిగా చండూరుకు చెందిన లింగోజ్‌ కిరణ్‌ ఇపుడు నియోజకవర్గంలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. అతను అంటే తెలియనివారు ఉండరు. చాలా మంది అతన్ని చూడకున్న కేఆర్‌జీఆర్‌(కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్మీ) కిరణ్‌ అనే పేరు ఎపుడో అపుడు వినే ఉంటారు. ఇతని స్వగ్రామం వచ్చేసి చండూరు మండల పరిధిలోని శిర్థేపల్లి అయితే ఉపాధిరీత్య హైదరాబాదులో చాలా కాలం ఉన్నారు. మార్కెటింగ్‌ చేస్తూ వివిద ప్రాంతాలు తిరేగేవాడు. ముందుగా ఇతనికి టీడీపీ అన్న చంద్రబాబు నాయుడు అన్న అభిమానం ఉండేది. తెలంగాణ వచ్చాక 2016లో ఇతను వృత్తిరీత్య ఒక సారి చిట్యాలకు వచ్చాడు. అపుడే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారి గురించి తెలుసుకున్నాడు.

Read also : అద్భుతమైన VFX ను తలపించేలా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు!

చిట్యాలలో చాలా మంది యువత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫాలోవర్లుగా ఉన్నారు. ఆయన సుశీలమ్మ ఫౌండేషన్‌తో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫిదా అయి విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. కాని ఆయనను మాత్రం కలవలేదు, చూసే అవకాశం రాలేదు. ఏడాదిన్నర క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ చెరువుగట్టు నుంచి శ్రీశైలం వరకు 250 కిలోమీటర్లు, 5రోజులు కాలినడకన చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అపుడే కిరణ్‌ ఎమ్మెల్యేగారి దృష్టిలో పడ్డాడు.
అలాగే అరుణాచలంలో రాజగోపాల్‌రెడ్డి ఫ్లెక్సీతో గిరిప్రదక్షణ సైతం చేశాడు. అంతటితో ఆగలేదు. గత సంవత్సరం నిర్వహించిన మహాకుంభమేళాలో రాజగోపాల్‌రెడ్డి ఫ్లెక్సీతో స్నానం ఆచరించి రాజగోపాల్‌రెడ్డి అభిమానిగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక అతను బయటికి వెళితే అతని చొక్కపైన రాజగోపాల్‌రెడ్డి ఫోటో ఉండాల్సిందే వెనుక భాగంలో కేఆర్‌జీఆర్‌ ఆర్మీ అని రాసి ఉండాల్సిందే. ఎమ్మెల్యేగారు ఎలాగైతే సుశీలమ్మ ఫౌండేషన్‌తో సేవాకార్యక్రమాలు చేస్తున్నారో అలాగే తాను సంస్థను స్థాపించి ఆయన బాటలోనే పయణించాలనుకున్నాడు. ఏడాది క్రితం కేఆర్‌జీఆర్‌(కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి) ఆర్మీ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. నియోజకవర్గంలో 300లకు పైగా ఈఆర్మీలో యువత ఉన్నారు. కిరణ్‌ ఇచ్చే ఒక్క పిలుపుతో కేఆర్‌జీఆర్‌ ఆర్మీ మొత్తం కదిలిస్తుంది. తనకు ఎలాంటి ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నా ఆస్పత్రిలో ఉన్న తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కిరణ్‌ తెలిపాడు. ఎన్నికల్లో పోటీ చేసే యోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారి మాటే తనకు శాసనమని ఆయన ఏది చెప్పితే అది అన్నారు. చండూరులో ఎలాంటి ఉత్సవాలు జరిగినా కిరణ్‌ అడావుడి అంతా ఇంత ఉండదు. అతని ఫెక్సీల్లోను రాజగోపాల్‌రెడ్డి నామస్మరణే ఉంటుంది. ఇక బోనాల పండుగకు రాజన్న బోనం అంటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంది. పదోవార్డు ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

Read also : థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button