Thursday, February 26, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఏ పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారు : చంద్రబాబు

ఏ పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారు : చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వెలుగొండ ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా మార్కాపురంలో పర్యటించారు చంద్రబాబు. అయితే ఈ పర్యటనలో భాగంగా మార్కాపురం పట్టణం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసిపి పార్టీ పై తీవ్రంగా మండిపడ్డారు. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకటి రోజులు చూశారు అని.. రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులకు వెలుగొండ ప్రాజెక్టు అనేది ఒక కల లాంటిది. అలాంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే పూర్తయిందని చెప్పి.. దీనిని జాతికి అంకితం చేస్తున్నాను అని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారని మండిపడ్డారు. పనులు పూర్తికాకుండానే రిబ్బన్ కట్ చేశారు అని తీవ్రంగా విమర్శించారు. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు గతంలో నేనే శంకుస్థాపన చేశాను.. తిరిగి మళ్లీ నేనే పూర్తి చేసే అవకాశం రావడం నిజంగా ఆ దేవుడు చేసినటువంటి విధి అని సీఎం తెలిపారు. గత పాలకులు లాగా వట్టి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే అవసరం తనకు లేదు అని మార్కాపురం భారీ బహిరంగ సభలో భాగంగా ప్రజలకు విన్నపించారు.

జట్టు కష్టాల్లో ఉంటే నాకు ఆనందం : జితేష్ శర్మ

రావిర్యాలలో పింఛన్ల కోసం పడి కాపులు కాస్తున్న వృద్ధులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments