
హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంటూరు రోడ్డులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. డీసీఎం వ్యాన్, కారు అతి వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
హయత్ నగర్ పసుమాముల నుండి కుంట్లూర్ వెళ్తున్న డీసీఎం ను వేగంగా వచ్చిన కారు ఎదురెదురుగా ఢీకొట్టడం తో
కుంట్లూర్ గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డి లు అక్కడిక్కడే మృతి చెందిగా మరో వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండటం తో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.మృతులు నిన్న రాత్రి పెద్ద అంబర్ పేట్ లోని ఒక ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ నుండి నారపల్లి లో ఉన్న వ్యవసాయ క్షేత్రనికి వెళ్ళి రాత్రి అక్కడ ఉండి ఉదయమే కుంట్లూర్ తమ నివాసాలకు వెళ్తున్నట్లుగా సమాచారం,
చనిపోయిన ముగ్గురు వ్యక్తులు వాల కుటుంబం లో ఒక్కొక్క అబ్బాయి లు కావడం తో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు,ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపం లో ఉన్న పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి,కేస్ నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.