
Elon Musk: జనాభా పెరుగుదల చాలా సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తునన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తుందంటున్నారు. అందుకే, ఒక్కరు, లేదా ఇద్దరు పిల్లలు ముద్దు అనే స్లోగన్ అందుబాటులోకి వచ్చింది. ఉరుకుల పరుగులు జీవితంలో తక్కువ మంది పిల్లలను కనడం బెస్ట్ అనకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఒక్కరు లేదంటే ఇద్దరు పిల్లలు ఉంటే, వారికి చక్కగా చూసుకోచ్చని భావిస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తక్కువ మంది పిల్లలు ఉండడం మంచిదనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపర కుబేరుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ముగ్గురు పిల్లల్ని కనాలన్నా మస్క్
జననాల రేటు తగ్గుదల అనేది మానవ జాతికి ముప్పుగా మారబోతోందని ఎలన్ మస్క్ కామెంట్ చేశారు. ఒకరు, ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకునే వారు లేదంటే అసలు పిల్లలు వద్దనుఉనే వారితో వచ్చే లోటును మిగతా వాళ్లు భర్తీ చేయాలన్నారు. పిల్లల్ని కనగలిగే వారు కనీసం ముగ్గురిని కనాలన్నారు. లేదంటే ప్రపంచ జనాభా భారీగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఫార్చ్యూన్ నివేదికలోని వివరాలతో కూడిన పోస్టును షేర్ చేశారు. జనాభా స్థాయిని కొనసాగించేందుకు ప్రతి మహిళ సగటున 2.7 మంది పిల్లలకు జన్మనివ్వాలని ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఆ సగటు 1.66గా ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని ధనిక దేశాల్లో పరిస్థితి మరింత ఆధ్వాహ్నంగా ఉన్నట్లు వెల్లడించింది. అందుకే పిల్లలను వీలైనంత మంది ఎక్కువగా కనడమే మంచిదని మస్క్ అభిప్రాయపడ్డారు. అన్నట్లు మస్క్ కు సుమారు అరడజన్ మంది పిల్లలు ఉన్నారు.
Read Also: ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!