
Jyothi Malhotra Charge Sheet: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆమె పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరించింది నిజమేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు 2,500 పేజీల ఛార్జ్ షీటును దాఖలు కోర్టుకు అందజేశారు. ఆమె పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిందనడానికి కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు మూడు నెలలపాటు విచారణ అనంతరం పోలీసులు ఈ ఛార్జ్ షీటును దాఖలు చేశారు.
మేలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్
జ్యోతి మల్హోత్రాను మే నెలలో హర్యానాలోని హిసార్‌లో అరెస్టు చేశారు. ఆమె పాక్ హైకమిషన్ లో ఎహ్సాన్ ఉర్ రహీమ్ అనే వ్యక్తితో టచ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె పాకిస్తాన్ కు రెండు సార్లు వెళ్లివచ్చినట్టు వెల్లడించారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రహీమ్ ను పర్సోనా నాన్ గ్రేటాగా అంటూ దేశం విడిచివెళ్లాలని కేంద్రం ఆదేశించింది. గూఢచర్యం, గోప్యమైన విషయాలను లీక్ చేయడం లాంటి ఆరోపణలపై అతడిని దేశం వీడాలని తేల్చి చెప్పింది.
చాలా కాలంగాణ పాక్ కు గూఢాచర్యం
పోలీసుల ఛార్జ్ షీటులో జ్యోతి మల్హోత్రా గూఢాచర్యం గురించి పోలీసులు కీలక విషయాలు తెలిపారు. రహీమ్ తోపాటు ఐఎస్ఐ ఏజెంట్లు షకీర్, హసన్ అలీ, నాసిర్ థిల్లాన్ తో ఆమె టచ్ లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 17న పాకిస్థాన్‌కు వెళ్లిన ఆమె.. మే 15న తిరిగొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ తరువాత జూన్ 10న చైనా వెళ్లిన ఆమె జులై వరకూ అక్కడే ఉన్నారని వెల్లడించారు. ఆ తర్వాత నేపాల్ కు వెళ్లారు. కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లిందని వివరించారు.
పాకిస్తాన్ లో కీలక వ్యక్తులను కలిసిన జ్యోతి
పాకిస్తాన్ కు వెళ్లిన ఆమె పంజాబ్ ముఖ్యమంత్రి, పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్‌ను కలిసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ హైకమిషన్ అధికారితో టచ్ లో ఉన్నట్టు హర్యానా పోలీసులు తెలిపారు. అయితే, మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించిన వివరాలేవీ ఆమె దగ్గర లేవని వెల్లడించారు.
Read Also: భారత్ కు చైనా విదేశాంగ మంత్రి.. పర్యటన వెనుక కారణం ఇదే!