అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడడు : హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన కేసీఆర్ పై అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గతంలోనూ కేసీఆర్ పై ఎన్నో నీచపు మాటలు మాట్లాడారని.. కెసిఆర్ ను కాల్చిపారేయాలని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా కేటీఆర్ ని కూడా ఎన్నో మాటలు అన్నారు. చివరికి నా ఎత్తు గురించి కూడా రేవంత్ రెడ్డి అడ్డమైన కూతలు కూసాడని రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డాడు. అసలు రాజకీయాల్లో బాడీ షేమింగ్ అనేది ఉంటుందా?.. అసలు నువ్వు మనిషివా లేక పశువు వా రేవంత్?.. అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలా మాట్లాడడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఎప్పుడు లేని విధంగా మండిపడ్డారు.

హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?

జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

YS Jagan: జగన్‌ నా ఆస్తులు లాగేసుకున్నారు – బాలినేని భావోద్వేగం

Exit mobile version