హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ అయినటువంటి సజ్జనార్ వెల్లడించారు. అంతేకాకుండా సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తను ఎవరిపై కక్షపూరితంగానూ, వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని… కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా సజ్జనర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు నష్టపోవడమే కాకుండా ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని కాబట్టి వీటిని నమ్మి ఎవరు కూడా మోసపోవద్దు అని ప్రజలకు సూచించారు.

ఏప్రిల్ 1 నుంచి మొబైల్ ఫోన్లు,LED, LCD టీవీల ధరలు తగ్గింపు!

కాగా తాజాగా హర్ష సాయి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు… ఏడాదికి 100 కోట్లు నుండి 500 కోట్లు ఇస్తామన్నా మేము తీసుకోలేదని హర్ష సాయి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చిన డబ్బులు తిరిగి మళ్లీ ప్రజలకే అందజేస్తున్నామని హర్ష సాయి తెలిపాడు. అయితే హర్ష సాయి వ్యాఖ్యలపై సజ్జనార్ తీవ్రంగా మండిపడ్డారు. మీ ఫాలోయింగ్ ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుఎంసర్లను అన్ ఫాలో చేసేయండి అంటూ సజ్జనార్ ట్విట్ చేశారు.

మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు

Exit mobile version