Govt Land : ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు..!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- గుండాల మండలంలో ఎమ్మార్వో ఆఫీస్ కు కూతమెట్టు దూరంలో ప్రభుత్వ స్థలం ఉంది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టడాలపై ఆర్డీఓ, ఎంపీడీవో ఆదేశాల మేరకు మండలం గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడాల నిర్మాణాల పై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని గతంలోనే అధికారులు వారికి నోటీసులు అందజేశారు. అయినా అధికారుల మాటలు పెడచెవున పెడుతూ అధికారుల మాటలను లెక్కచేయకుండా అక్రమదారులు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.

అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడంతో జిల్లా ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డిఓ స్పందించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని నిర్మాణానికి సంబంధించిన పరికరాలను గ్రామ కార్యదర్శి సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే కూల్చివేతలు తప్పవని వారికి తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి …

  1. టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

  2. ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?

  3. హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?

  4. జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

  5. మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు

 

Exit mobile version