బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. ప్రస్తుతం జనసేన నాయకుడు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత. వైఎస్ జగన్‌కు దగ్గర బంధువు. అయినా.. వైసీపీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు బాలినేని. జగన్ పార్టీలో ఉన్నప్పుడు పడిన అవమానాలు.. ఇప్పుడు తలుచుకున్నా నిద్రరాదని జనసేన ఆవిర్భావ సభ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. తాను పడిన కష్టాలు చెప్పుకుంటూ… కన్నీరు పెట్టుకున్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన పరిస్థితిని… ఇప్పుడు జనసేనలో తనకు లభిస్తున్న గౌవరాన్ని ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. జగన్ తన ఆస్తులు లాగేసుకుని చెప్పారు బాలినేని. తనవే కాదు.. తన వియ్యంకుడి ఆస్తుల్ని కూడా కాజేశారని ఆరోపించారు. ఈ విషయం బయటపెట్టినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై విరుచుకుపడతారని.. అయినా దేనికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్పారాయన. తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేశారాయన. దర్యాప్తులో… తాను చెప్పిన విషయాలన్నీ నిజమేనని తేలుతుందన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు దినదినగండంగా ఉండేదని… ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబం కూడా కష్టాలు పడిందన్నారు. జనసేన అధ్యక్షుడు పపన్ కళ్యాణ్‌ను ప్రసంశించారు. తాను వైసీపీలో ఉన్నా పవన్ ఎప్పుడూ తనను విమర్శించలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసినా… తనను మాత్రం మంచోడనే అన్నారని గుర్తుచేసుకున్నారు.
జగన్ ఆస్తులు లాగేసుకున్నారన్న బాలినేని ఆరోపణలు… ఏపీలో రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు..? ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతుందా…? జగన్ ఆస్తులు లాగేసుకున్నట్టు బాలినేని ఆధారాలు బయటపెడతారా..? ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో ఏమో.