
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఓ విద్యార్థి పట్ల మంచి మనసు చాటుకున్నారు. విద్యార్థి చదువు కోసం ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి మరి లోన్ ఇప్పించారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందినటువంటి మమత అనే వైద్య విద్యార్థినికి ఇటీవల కాలంలో MS ఆప్తాల్మాల్జీలో సీటు వచ్చింది. కానీ ఈ విద్యకు ఏడాదికి దాదాపు 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని.. ఇక మూడేళ్లలో మొత్తం కలిపి దాదాపు 23 లక్షల వరకు డబ్బులు అవసరం అయ్యాయి. ఇక చేతిలో అంత డబ్బులు లేక లోన్ తీసుకుందాము అని అనుకుంటే తన ఇంటిపై ఇది వరికే లోన్ ఉండడంతో ఆగిపోయారు. ఇక ఇదే విషయాన్ని నేరుగా వెళ్లి హరీష్ రావుకు చెబితే అతను వెంటనే తన ఇంటిని తాకట్టుపెట్టి మరీ లోన్ ఇప్పించారు. కేవలం మాట చెప్పి వదిలి వేయకుండా ఆ లోన్ శాంక్షన్ అయ్యేంతవరకు కూడా హరీష్ రావు మాతోనే ఉన్నారు అని మమత అనే విద్యార్థిని నేరుగా మీడియాతోనే పంచుకున్నారు. గతంలో మా చెల్లెలకు కూడా ఇలానే హరీష్ రావు సార్ సాయం చేశారు అని విద్యార్థిని అన్నారు. దీంతో విద్యార్థులు చదువు కోసం హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టి మరి లోన్ ఇప్పించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా హరీష్ రావు కు రుణపడి ఉంటాము అని తెలిపారు.
Read also : జట్టులో పేరు లేదని బాధపడే రోజులు పోయాయి : ఇషాన్ కిషన్
Read also : ప్రాణాలు తీస్తున్న గ్యాస్ గీజర్లు.. ఇవి ఎంత డేంజర్ అంటే?





