తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి, నేను సవాల్ విసురుతున్నా.. నువ్వు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పారు.బిఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో హరీష్ రావు ఈ కామెంట్లు చేశారు. ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామని హరీష్ రావు చెప్పారు. బిజెపి ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని సూచించారు. బిఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటామని హెచ్చరించారు.పోలిస్, ఇతర అధికారులను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్త , రాబోయేది మా ప్రభుత్వమే అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 వేల కోట్లు నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని హరీష్ రావు ఆరోపించారు. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ , ఒక కార్పొరేషన్ చైర్మన్ మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయి..వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలిస్ కమాండ్ కంట్రోలో సమీక్షలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.