
క్రైమ్ర్ మిర్రర్, గండిపేట్ :-రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఇంద్రాగాంధీ హౌసింగ్ సొసైటీ లో మంగళవారం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పార్క్ స్థలంగా ఉన్న సర్వే నెం. 234/2 ప్రాంతంలో రోడ్డులో ఉన్న గుంతలు పూడ్చేందుకు మట్టి తీసేందుకు సాగిన పనుల సమయంలో, ఓ బండరాయికి హనుమాన్ విగ్రహం ఆకృతి తేలింది.ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన స్థానికులు.. ఆనందంతో, ఇష్టంగా భక్తిశ్రద్ధలతో విగ్రహానికి అభిషేకం చేసి, చందనం, పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుని రూపం బయటపడిన స్థలంలోనే గుడి నిర్మాణం చేపడతామని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, శివ, వెంకటేశ్వరరావు, నాని, లక్ష్మి, రాజేశ్వరి, శ్రావణి, పద్మ, నాగలక్ష్మి, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ మధ్య ఎన్నో విగ్రహాలు తవ్వకాల్లో బయటపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
Read also : ప్రశ్నిస్తే జైలు లో పెడుతున్నారు.. చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించిన జగన్!
Read also : గుర్తుండిపోయే విజయం.. గౌతమ్ గంభీర్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్!