
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
హనుమాన్ జయంతి సందర్భంగా మహాదేవ్ పూర్ మండలంలోని హనుమాన్ ఆలయాలన్ని ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. రామ భక్తుడ్ని మనసారా పూజిస్తే.. అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామంలోని శివకేశవాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండగ జరిగింది. హనుమాన్ మాలధారణ భక్తుల మధ్య జరిగిన ఈ శోభాయాత్రలో గ్రామస్తులు ప్రజలు మరియు హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైసీపీని వీడుతున్న బొత్స..? – కూటమిలో చేరేందుకు సన్నాహాలు..!
వైసీపీని వీడుతున్న బొత్స..? – కూటమిలో చేరేందుకు సన్నాహాలు..!