
సంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- సంగారెడ్డి జిల్లా హద్నూర్ మండలానికి చెందిన పాలిటెక్నిక్ పూర్తి చేసిన అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. జిల్లా సోషల్ మీడియా ను హ్యాండిల్ చేస్తున్న సిబ్బంది హద్నూర్ ఎస్ఐ కీ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వ్యసాయ పొలాలలో ఉన్న లొకేషన్ కు చేరుకొని అమ్మాయికి నచ్చచెప్పి ఆత్మహత్యకు పాల్పాడటం సరికాదని, ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని ఎడ్యుకేషన్ పై దృష్టి సారించాలని తెలిపి, అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇట్టి విషయంలో అమ్మాయి తల్లిదంద్రులు పోలీసులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. 8 లీటర్ల గుడుంబా, బైక్ స్వాదినం
వే మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూల పంపిణీ





