
GST Reforms: జీఎస్టీలో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఎంత తగ్గుతాయి? అనే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు తగ్గడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంతో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబ్ లు ఉండగా, ఇకపై 12 శాతం, 28 శాతం శ్లాబ్ లను తొలగించి.. 5, 18 శ్లాబ్ లలో సరద్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏ వస్తువుల ధర తగ్గుతుంది? వేటి ధర పెరుగుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ధరలు తగ్గే, పెరిగే వస్తువులు ఇవే!
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. నిత్యవసర వస్తువులు అయిన ప్యాకేజ్డ్ పాలు, బటర్, పన్నీర్, నెయ్యి, పళ్లరసాలు, బాదాం, డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జామ్, సబ్బులు, టూత్ పేస్టులు, హెయిర్ ఆయిల్, గొడుగులు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, కుట్టు మిషన్లు, సాధారణ వాటర్ ఫిల్టర్లు, అల్యూమినియం, స్టీలు పాత్రలు, కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గీజర్లు, చిన్న వాక్యూమ్ క్లీనర్లు, రూ.1000 కన్నా ఖరీదైన రెడీమేడ్ దుస్తులు, రూ.1000 ధరలోపు చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, వైద్య పరీక్షల కిట్లు, సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గే అవకాశం ఉంది. అటు హెల్త్, బీమా పాలసీల ప్రీమియం కూడా భారీగా తగ్గనుంది. సిమెంటు, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, 32 అంగుళాలకుపైన ఉన్న ఎల్‌ఈడీ టీవీలు, ప్రింటర్లు, రేజర్లు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కార్లు, ఖరీదైన ద్విచక్రవాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక ఖరీదైన రెడీమేడ్ దుస్తులు, వాచీలు, బూట్లు, కూల్ డ్రింక్స్, ఖరీదైన కార్లు, వజ్రాలు రత్నాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, హోటళ్లలో గదుల అద్దె వంటి వాటి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: భారత్ కు చైనా విదేశాంగ మంత్రి.. పర్యటన వెనుక కారణం ఇదే!