
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ ఈనెల 22 నుంచి అమలులోకి రానున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా సంఘం మరియు విజయ డైరీలు ప్రజలకు శుభవార్త తెలిపింది. జీఎస్టీ తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు కూడా తగ్గిస్తున్నట్లు కీలక ప్రకటనలు చేశాయి. ఒకవైపు సంఘం డైరీ UHT లీటర్ పాలు పై రెండు రూపాయలు, నెయ్యి మరియు వెన్నె కిలోకి 30 రూపాయలు, పన్నీర్ కిలో కు 15 రూపాయలు అలాగే బేకరీ ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి కిలో పై 20 రూపాయలు మేరా తగ్గించునున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు విజయ డైరీ కూడా తమ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నామని ప్రకటించింది. విజయ డైరీ టెట్రా పాలు లీటర్ కు 5 రూపాయలు చొప్పున, ఫ్లేవర్డ్ మిల్క్ లీటర్ కు 5 రూపాయలు, వెన్నె-నెయ్యి పై కిలోకి 30 రూపాయలు అలాగే పన్నీరు పై కిలో కి 20 రూపాయలు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కాగా ఈ ధరలు అన్ని కూడా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని నేడు ప్రకటన విడుదల చేశారు. కేవలం పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి వాటి పైనే కాకుండా 22వ తేదీ నుంచి దాదాపు చాలా వస్తువులపై జిఎస్టి ప్రభావం వల్ల ధరలు అనేవి తగ్గనున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ కొత్త జీఎస్టీ అమలులోకి రానున్నడంతో ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్లకి నచ్చిన వస్తువులను తక్కువ ధరలు కొనడానికి ఆసక్తిగా ఉన్నారు. జీఎస్టీ ధరలను తగ్గించినందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Read also :జాతికి అంకితం అన్నారు.. ప్రాజెక్టును గందరగోళం చేశారు : చంద్రబాబు
Read also : ఒకవైపు దసరా సెలవులు.. మరోవైపు భారీ వర్షాలు!.. పిల్లలు జాగ్రత్త