ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

పవన్‌ జాతకం సూపర్‌ - మరి చంద్రబాబు, జగన్‌ పరిస్థితి ఏంటి?

ఉగాది రోజు పంచాంగ శ్రవణం కామన్‌. ప్రముఖులైతే పండితులను ఇళ్లకు పిలిపించుకుని పంచాంగ శ్రవణం చేయించుకుంటారు. అదే సామాన్యులైతే.. పండితుల దగ్గరకు వెళ్లి.. కొత్త ఏడాది తమకు ఎలా ఉండబోతోందో అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రం బాగుండాలంటే… పాలకులు బాగుండాలి. మరి.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌… వైసీపీ అధ్యక్షుడు జగన్‌ జాతకాలు ఎలా ఉన్నాయి…? ఈ ఎడాది ఎవరికి లాభిస్తుంది…? ఎవరికి రాజయోగం పట్టబోతోంది…?

ఏపీ సీఎం చంద్రబాబు జాతకం బ్రహ్మాండంగా ఉందంటున్నారు పండితులు. చంద్రబాబు జాతకంలో చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. గురుమహాదశ నడుస్తుందని… ఇది 2033 వరకు ఉంటుందన్నారు. చంద్రబాబు మట్టి పట్టుకున్నా… బంగారం అవుతుందన్నారు. అధికారం పట్టు ఉంటుందన్నారు. అయితే… ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జన్మనక్షత్రంలో అష్టమ శని ఉందని… 2027 వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రాణం మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. 2027, డిసెంబర్‌ దాటితే చంద్రబాబుకు తిరుగుండదని అంటున్నారు. చంద్రబాబు జాతకంలో శని ప్రభావం బలంగా ఉందని.. 2027 వరకు ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు పండితులు.

Also Read : రేవంత్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి మధ్య సయోధ్య – వాళ్లంతా కలిసిపోయినట్టేనా..!

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జాతకం కూడా బాగుందని అంటున్నారు పండితులు. బుధ ఆదిత్య యోగం, చంద్రమంగళ యోగం ఉచ్ఛస్థితిలో ఉందని తెలిపారు. కుజుడు, చంద్రుడితోపాటు రాహువు కలిసి ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. రాహువు ఉంటే… ఉన్నదాని కంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారని చెప్పారు. ఆయన పక్కన ఉన్నవారు తప్పుదారి పట్టించే అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పుడు మాటల వల్ల పవన్‌ కళ్యాణ్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని… కనుక అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ జాతకం 2032 వరకు అనుకూలంగా ఉన్నా.. శని ప్రభావం కూడా బలంగా ఉందంటున్నారు. 2027 డిసెంబర్‌ వరకు పవన్‌ కళ్యాణ్‌ రాజయోగం ఉందని… 2027 నుంచి 2030 వరకు పరిస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంటుందన్నారు. ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఉన్నాయన్నారు.

Also Read : రేవంత్‌రెడ్డికి తిరుగులేదు, కేసీఆర్‌ మహర్జాతకుడు – తెలంగాణ పొలిటికల్‌ పంచాంగం..!

వైఎస్‌ జగన్ జాతకం మాత్రం అద్భుతం ఉందని అంటున్నారు పండితులు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవర్‌ ఇచ్చేది కుజుడు. ఆ కుజభగవానుడు జగన్‌ జాతకంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడని తెలిపారు. మానసిక ప్రశాంత కూడా ఉందని అన్నారు. అయితే గురుఛండాల యోగం వల్ల… ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అనుకున్నదే చేయడం… ఎవరు చెప్పినా చేయకపోవడం వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చెప్పుడు మాటల వల్లే వైఎస్‌ జగన్‌కు నష్టం జరిగిందని… జరగబోతోందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు

  2. 16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం

  3. వైఎస్‌ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు

  4. కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన జగన్‌

  5. టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

Back to top button