
తెలంగాణలో గ్రూప్ వన్ అభ్యర్థులు పోరాటం కొనసాగిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని, మూల్యాంకనం సరిగా జరగలేదని.. తెలుగు మీడియం విద్యార్థులకు మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. తాజాగా గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోనికి వచ్చింది. 15 రోజుల క్రితం గ్రూప్ 1 విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది.
Also Read : అమీన్‌పూర్‌లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిరసనలో పాల్గొన్న గ్రూప్ 1 అభ్యర్థిని 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని.. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా రేవంత్ సర్కార్ కుట్రలు చేసిందని క్రాంతిదల్ అధ్యక్షుడు పృథ్వీ సంచలన ఆరోపణలు చేశాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన పృథ్విరాజ్.. పలు విషయాలు వెల్లడించారు. గత సంవత్సరం గ్రూప్స్ అభ్యర్థులు నిరసన తెలిపినప్పుడు, ఆత్మహ్యతకు పాల్పడిన విద్యార్థిని ఈ నిరసనలో పాల్గొన్నది. ధర్నాలో పాల్గొన్నందుకు ఆమె పనిచేసే చోటుకు వెళ్లి అరెస్టు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని అమ్మాయి వాళ్ల ఇంటికి తెలిపింది యాజమాన్యం.దీంతో చదువు మధ్యలో ఆపేసి విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు
Also Read : సూర్యాపేట జిల్లాలో దారుణం… మైనర్ బాలికపై అత్యాచార యత్నం… !
చదువు ఆపేసి ఇంటికి వెళ్లిన విద్యార్థిని..దీంతో తీవ్ర మనస్థాపానికి గురై 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని క్రాంతిదల్ అధ్యక్షుడు పృథ్వీ తెలిపారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డ రేవంత్ సర్కార్ అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు క్రాంతిదల్ అధ్యక్షుడు పృథ్వీ.