Tuesday, March 17, 2026
Homeక్రైమ్బరాత్ లో డీజే లొల్లి.. పెళ్లి కొడుకును కొట్టి చంపడమేంట్రా?

బరాత్ లో డీజే లొల్లి.. పెళ్లి కొడుకును కొట్టి చంపడమేంట్రా?

DJ Dispute Turns Deadly:  ఈ రోజుల్లో పెళ్లి బరాత్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పెళ్లి ఎలా అయినా జరగనీ.. బరాత్ లో డీజే పెట్టాల్సిందే! పీలక దాకా తాగి ఒళ్లు అలిసేలా ఎగరాల్సిందే! ఎవరైనా ఇక చాలు పదండి అంటే, దుమ్ము దుమారం చేయాల్సిందే! తాజాగా యూపీలో ఓ బరాత్ లొల్లి ఏకంగా పెళ్లి కొడుకు ప్రాణాలు పోయేలా చేసింది. తాగిన మైకంలో కొంత మంది యువకులు ఏకంగా పెళ్లి కొడుకునే కొట్టి చంపేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఉత్తర ప్రదేశ్ లోని త్రిలోక్‌ పూర్ కు చెందిన రాకేష్ కుమార్ అనే యువకుడికి జగదీష్‌ పూర్ కు చెందిన యువతితో తాజాగా పెళ్లి అయ్యింది. ఆ తర్వాత పెళ్లి కూతురు ఇంటి దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు బంధువులు అంతా పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి కొడుకుకు వెల్ కమ్ చెప్పేందుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ డీజే ఏర్పాటు చేసింది. పెళ్లి కొడుకు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చే సరికి కొంత మంది యువకులు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు.

డీజే ఆపాలనడంతో వివాదం

పెళ్లి కొడుకు వాళ్లు వచ్చి బయట నిలబడ్డారు. ఎంతకీ డ్యాన్సులు వేయడం ఆపకపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువకులు వారితో గొడవకు దిగారు. ఆ గొడవ కాస్తా ముదిరింది. గొడవను ఆపడానికి పెళ్లి కొడుకు తండ్రి వెళ్లాడు. తాగిన మత్తులో ఉన్న కుర్రాళ్లు కర్రలతో పెళ్లి కొడుకు తండ్రిని కొట్టడం మొదలు పెట్టారు. తండ్రిని కొట్టకూడదని పెళ్లి కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ యవకులు పెళ్లి కొడుకు తండ్రిని కొట్టడం మానేసి, పెళ్లి కొడుకుపై దాడి చేశారు. ఓ యువకుడు చేతిలోని తుపాకీతో పెళ్లి కొడుకు తల మీద గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన పెళ్లి కొడుకు సృహ తప్పిపడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: ఇన్ స్టాలో పంచాయితీ, బయట హత్యాయత్నం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments