Gromor Rangoli Competition for Farmer Families: అన్నదాతలు సంతోషంగా సక్రాంతి పండుగ జరుపుకోవాలని గ్రోమోర్ మార్కెటింగ్ మేనేజర్ రత్న సునీల్, ఏరియా మేనేజర్ శేషు ఆకాంక్షించారు. రైతులు చక్కటి పంటలు పండించేలా గ్రోమోర్ తగిన ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు అవసరమైన అన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా రైతు కుటుంబాలకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. రైతుల నుంచి మంచి స్పందన లభించినట్లు చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముగ్గుల పోటీలు
సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రోమోర్ కేంద్రాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నల్లగొండ, మునుగోడు, కనగల్లు, నేరేడుచర్లతో పాటు పలు మండలాల్లో రంగోలీ కాపిటీషన్ ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో రైతు కులుంబాలు పాల్గొన్నాయి. చక్కటి ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. చక్కటి ముగ్గులు వేసి, విజేతలుగా నిలిచిన వారికి గ్రోమోర్ తరపున బహుమతులు అందించారు. గ్రోమోర్ సంస్థ రైతులందరినీ ఒక్కచోటుకు చేర్చి ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. పంటల సాగుకు చక్కటి మందులు అందించడంతో పాటు పండుగల వేళ రైతులకు ముగ్గల పొటీలు పెట్టడం ఆనందంగా ఉందన్నారు.
రైతులతో మన గ్రోమోర్ అనుబంధం పెంచుకునేలా..
అన్నదాతలు సంతోషంగా ఉంటేనే భారతదేశం బాగుంటుందని మన గ్రోమోర్ మార్కెటింగ్ మేనేజర్ రత్న సునీల్, ఏరియా మేనేజర్ శేషు చెప్పారు. రైతులు చక్కగా పంటలు పండించేందుకు తమ సంస్థ మంచి ఎరువులతో పాటు పురుగు మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పంటల సాగు విషయంలో ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా మన గ్రోమోర్ తరపున అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతులతో మన గ్రోమోర్ అనుబంధాన్ని పెంచుకునేందుకు అవసరం అయిన కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా తాజాగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసినట్లు వివరించారు. ఈ పోటీలను నిర్వహించేందుకు సహకరించిన రైతులకు, మన గ్రోమోర్ సిబ్బందికి రత్న సునీల్ ధన్యవాదాలు చెప్పారు.





