
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడంతో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్రకాశం జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రకాశం జిల్లాలోని ముఖ్య అధికారులందరూ కూడా ఒకే చోట అది కూడా సామాన్యమైన ప్రజల లా మంచాలపై కూర్చుని ఏర్పాట్ల గురించి చర్చిస్తున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలు కనిపిస్తున్న వారందరూ కూడా జిల్లా స్థాయి అధికారులే. ఇందులో సాక్షాత్తు ఒకరు కలెక్టర్, మరొకరు JC, ఇంకొకరు SP. వీరందరూ కూడా ముఖ్య అధికారులే.
Read also : ‘డెడ్ ఎకానమీ’.. రాహుల్ కామెంట్స్ ను ఖండించిన శశిథరూర్!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్శి పర్యటనలో భాగంగా వస్తున్న సందర్భంలో.. నిన్న సాయంత్రం కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఎస్పీ దామోదర్ ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణంగా గ్రామంలోని మంచాల్లో కూర్చుని ఏర్పాట్లపై చర్చించడం విశేషంగా మారింది. ఈ అధికారుల గురించి ప్రస్తుతం జిల్లా మొత్తం కూడా ప్రశంసించేలా ఈ ఒక్క ఫోటో ఆదర్శంగా నిలిచింది. ఇలా ప్రకాశం జిల్లా అధికారులందరూ కలిసి మెలిసి ఉంటూ ఇలానే అన్ని పనులు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
Read also : సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ధన్‌ఖడ్ ప్లేస్ లో వచ్చేదెవరో?