
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి*:- చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు కెనాల్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా నడుస్తుంది దీనికి సంబంధించి పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను సమన్వయపరిచే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. కాలేశ్వరం కాల్వ నిర్మాణానికి పరిహారం ప్రకటించకుండా భూములు ఇవ్వమని తేల్చి చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో మహదేవ్పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో మహాదేవపూర్ తాసిల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబటిపల్లి గ్రామానికి చెందిన 12.5 ఎకరాలు భూమి,మేడిగడ్డ శివారులోని 3.5 ఎకరాల భూమి భూమి గల రైతులతో సంప్రదింపులు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంట ఇరిగేషన్ ఏఈ, ఆర్ ఐ, సీనియర్ అసిస్టెంట్ మరియూ గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ఉదయం నుంచే ‘భానుడి ప్రతాపం’..రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల
బార్డర్ లో భీకర కాల్పులు.. నలుగురు టెర్రరిస్టులను లేపేసిన ఇండియన్ ఆర్మీ