Tuesday, March 17, 2026
Homeజాతీయం40ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై...! గులాబి ద‌ళంలోకి జీవ‌న్ రెడ్డి...

40ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై…! గులాబి ద‌ళంలోకి జీవ‌న్ రెడ్డి…

  • రాజ‌కీయంగా ఇది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ‌

  • వ‌ర్గ‌పోరు భరించ‌లేక‌నే బీఆర్ ఎస్‌లోకి…

  • ఈ నెల 25న బీఆర్ ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు…

కరీంనగర్, క్రైమ్ మిర్ర‌ర్:  పార్టీ అంత‌ర్గ‌త విభేధాలు, అస‌మ్మ‌తి. మ‌నోవేద‌న‌ ఆందోళ‌న చివ‌రికి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.ఇక పార్టీని వీడ‌నున్నారు. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి ఇక చేతికి గుడ్‌బై చెప్పి కారు ఎక్కనున్నారు. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, హస్తం పార్టీ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని. ఆయన బహిరంగంగా మీడియా ముందే వెల్లడించడం గమనార్హం.

సంజ‌య్ వ‌ర్సెస్ జీవ‌న్ రెడ్డి…

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అప్పటి నుంచి జగిత్యాలలో వర్గపోరు మొదలైంది.అది కాస్తా ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తారస్థాయికి చేరుకుంది. తమ వర్గం వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి తమ అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి గెలిపించుకుని తన సత్తా ఏంటో హైకమాండ్‌కు తెలియజేశారు. అయినప్పటికీ తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తన అనుచరులతో జీవన్‌రెడ్డి చెప్పినట్లు సమచారం.

ఈ నెల 25వ తేదీన బీఆర్‌ఎస్‌లోకి…

ఈ నెల 25న బీఆర్ ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిచేరనున్నట్లు తెలుస్తోంది. గత 4 దశాబ్దాలుగా జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా గెలిచారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ రాకతో కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు చించేయడం, తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం ముందు, లోపల ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాలు, అగ్రనాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు.

గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు వెన్నుముక‌…

గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి చేయి ఇచ్చి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లోపెను సంచలనంగా మారింది. టీ. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది.

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అనిచెప్పవచ్చు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ బలం తగ్గే అవకాశం ఉండగా, బీఆర్‌ఎస్‌కు ఇది ఉత్తర తెలంగాణలో పెద్ద బూస్ట్‌గా మారనుంది. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ బలం మళ్లీ పుంజుకోవడానికి జీవన్ రెడ్డి రాక ఒక వరంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments