జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వెనకుండి జనసేన పార్టీ గెలవడానికి కృషి చేసిన నాగబాబు కష్టానికి ఫలితం దక్కింది. పవన్ కళ్యాణ్ వెళ్లి అధినేతలతో మాట్లాడగా నాగబాబుకి మంత్రి వర్గంలో ఏదో ఒక శాఖను ఇస్తారని చంద్రబాబు తాజాగా వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వెంటనే అందరికీ కూడా మంత్రివర్గంలో ఏ శాఖను నాగబాబుకి అప్పగిస్తారనే ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా నాగబాబుకు అప్పగించాల్సిన శాఖల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చర్చించినట్లు సమాచారం అందింది.
కుల గణన సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు?
జనసేన పార్టీకి కృషి చేసిన నాగబాబుకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ చంద్రబాబు హామీ ఇచ్చారు. దానికి అనుకున్నట్టుగానే సినిమాటోగ్రఫీ మరియు పర్యాటకశాఖ ను నాగబాబుకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా సమాచారం అందింది. అయితే ఇప్పటికే సినిమాటోగ్రఫీ మరియు పర్యాటకశాఖ కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. అయితే ఈ రెండు శాఖలను నాగబాబుకి అప్పగించి, కందులు దుర్గేష్ కి గనుల శాఖ అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు కూటమి సర్కార్ ఆలోచనలు చేస్తుందట. ఇక ఇవే కనుక జరిగితే సినిమా వాళ్లకు కూడా నాగబాబు సినిమా నుండి వచ్చాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి మేలు కలుగుతుందని ఆలోచనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
కాబట్టి నాగబాబుని మంత్రివర్గం లో తీసుకుంటామని చెప్పిన దగ్గర నుండి ఎప్పుడు తీసుకుంటారో, ఏ శాఖను ఇస్తారు అనే అనుమానాలన్నీ కూడా నేటితో తొలగిపోయాయి. తాజాగా పర్యటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖలను నాగబాబుకు అప్పగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీకి కృషి చేసిన కష్టానికి గాను ఫలితం దక్కినట్లే.
మునిగిపోయే అమరావతికి ఎవరూ పోరు.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్