
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి మరియు మేడారం జాతరను పురస్కరించుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ కారణంగా ఎంతోమంది జీవనోపాధి కోసం హైదరాబాద్ వంటి పలు ముఖ్య నగరాలకు వచ్చినటువంటి వారు తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగకు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉన్న కారణంగా ఇప్పటినుంచే ప్రజలు తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకుంటుంది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ప్రత్యేకంగా 6431 బస్సులను నడపనున్నట్లు ఆర్టిసి అధికారులు తాజాగా వెల్లడించారు.
Read also : అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు.. దేశద్రోహిగా ప్రకటించాలన్న హిందూ సంఘాలు?
మరోవైపు మేడారం జాతరకు ఈనెల 25వ తేదీ నుంచి హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా 3495 స్పెషల్ బస్సులు నడుపుతారు అని ప్రకటించారు. దీంతో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకలా ఉంటే మరోవైపు ఈ సంక్రాంతి మరియు మేడారం జాతరలను పురస్కరించుకొని బస్సుల టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ బస్సుల్లో అయితే సాధారణ టికెట్ చార్జీలు అదే ప్రత్యేక బస్సుల్లో అయితే 50% మేర టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లేటువంటి ప్రజలు కచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also : నూతన సంవత్సర వేల గోవిందా అనే నామస్మరణతో మారుమోగిన తిరుమల క్షేత్రం





