ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ అయినా స్విగ్గి మరియు జొమోటో లాంటి ఈ కామర్స్ కంపెనీల నుండి ఫుడ్డు అనేది ఆర్డర్ చేస్తూ ఉన్నారు. అత్యవసరంగా ఇంట్లో ఫుడ్ లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ జోమాటో లేదా స్విగ్గి యాప్ ద్వారా ఫుడ్ ను ఆర్డర్ చేసుకొని మరీ తింటున్నారు. అలాంటి ఆర్డర్ చేసుకునే వారికి డెలివరీ చార్జెస్ అంటూ చాలానే చార్జెస్ పడుతూ డబ్బులు అనేవి వృధా అవుతున్నాయి. అయితే తాజాగా స్విగ్గి మరియు జొమాటో ఫుడ్ ఆర్డర్ చేసుకునే తమ యూజర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
Read More : కుల గణన సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు?
త్వరలోనే స్విగ్గి మరియు జొమాటో ఫుడ్ యాప్స్ లో ఫుడ్ డెలివరీ చార్జీలపై టాక్స్ తగ్గించేందుకు GST క్యాన్సిల్ చేస్తుందనే యోచనలో ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఉన్న 18 నుంచి ఐదు శాతానికి తగ్గించవచ్చని CNBC TV 18 తాజాగా పేర్కొంది. ఫిట్మెంట్ కమిటీ సూచన మేరకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 2022 జనవరి 1 నుంచి ఈ చార్జీలు తగ్గిస్తాయని తెలుస్తోంది.
Read More : కొత్తగా వచ్చే మంత్రులు ఎవరో చెప్పిన కోమటిరెడ్డి.. తమ్ముడికి ఝలక్!
కాగా ఇప్పటికే రెస్టారెంట్లో సర్వీస్ ఛార్జితో తమ డెలివరీ చార్జీలు సమం చేయాలని స్విగ్గి మరియు జొమాటో కంపెనీలు గతంలో కేంద్రాన్ని కోరాయి. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఈ యాప్ల ద్వారా ఎక్కువగా సిటీలోని వారు ఫుడ్స్ ని ఆర్డర్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ కంపెనీలు డెలివరీ చార్జీలను కూడా ఎక్కువగానే ఈ మధ్య తీసుకున్నాయి. మరి ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఈ డెలివరీ చార్జీలు అనేవి తగ్గించునున్నాయి.
Read More : మునిగిపోయే అమరావతికి ఎవరూ పోరు.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్