
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,4 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 3న రాయలసీమ ప్రాంతంలో, 4 న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని ఆంచనా వేసింది. వర్షాలు పడే నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని.. కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అలాగే పశువులు కాపురులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదయింది.
బిగ్ బ్రేకింగ్… మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్!.. మరి మోనాలిస పరిస్థితి ఏంటి?
కాగా ఒకవైపు భారీ ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు రెండు రోజులు పాటు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. 3,4 తేదీలలో వర్షాలు పడడం… మిగిలిన రోజుల్లో భారీగా ఎండలు ఉండడం వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు పడితే మాత్రం కొంతమంది వ్యవసాయ రైతులకు భారీగా నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉండడంతో… ప్రభుత్వాలను నష్టపరిహారం కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు.
నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య… మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త!..