హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఉపాధి కూలీలకు ప్రభుత్వం గుడ్ చెప్పింది. ఏప్రిల్ 1,2026 నుంచి ఉపాధి కూలీలకు రోజువారి వేతనం పెరిగింది. గతంలో ఉన్న వేతనానికి అదనంగా 20 నుంచి 30 వరకు పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 300 నుంచి 320 మధ్య ఉంటున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 1 తరువాత చేసిన పనులకు పెరిగిన డబ్బులతో పడే అవకాశం ఉంది.
తెలంగాణ కార్మిక శాఖ ఏప్రిల్ 1 నుండి ప్రైవేట్ షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే వారికీ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్, ధరల పెరుగుదల ప్రకారం సెక్యురిటిగార్డులు, హోటల్ కార్మికులకు, దుకాణాల్లో పని చేసే కార్మికులకు సైతం వేతనాలు పెరిగాయి. పెరిగి ధరలు ఇంకా భవన నిర్మాణ, రహదారుల పనులు,హోటల్లు, రెస్టారెంట్లు, షాపులు, కమర్షియల్ షాపుల్లోపని చేసేవారికి వేతనాలు వర్తిస్తాయనితెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ (DA) బకాయిలు…
ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి, గతంలో ప్రకటించిన డియర్నెస్ అలవెన్స్ (DA) బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుండి విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాల్లో పెరుగుదల కనిపిస్తుంది. అన్ని వేతనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో (DBT) జమ చేయబడతాయి.పని వేళల్లో మార్పు: ఎండల తీవ్రత వల్ల ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుండే ప్రారంభించి, ఎండ ముదరక ముందే ముగించాలని అధికారులు ఆదేశించారు.
