అమరావతి, క్రైమ్ మిర్రర్ః ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ.7,358 కోట్ల ను విడుదల చేయనున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యల్ని వేగవంతం చేసింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా గతంలో తాను ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులను ఆరా తీశారు. అయితే నిధుల లభ్యతను బట్టి చెల్లిస్తున్నామని.. రూ.7,358 కోట్ల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
