ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని మంత్రి అచ్చం నాయుడు తాజాగా తెలిపారు. రేపు విశాఖపట్నం కు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని అన్నారు. ఇందులో భాగంగానే గత వైసిపి ప్రభుత్వంపై అచ్చం నాయుడు మండిపడ్డారు.
Read More : ఘోరంగా కొట్టుకున్న బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు
గత వైసిపి ప్రభుత్వం లో విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని రేపు జరగబోయే మోడీ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల కోరిక అయిన రైల్వే జోన్కు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇక మరోవైపు హోంమంత్రి అనిత కూడా రేపు ప్రధానమంత్రి హాజరు అయ్యేటువంటి సభ ప్రాంగణం ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో పరిశీలించారు.
Read More : భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ
కాగా ఒక వైపు ఆంధ్రప్రదేశ్ మరోవైపు తెలంగాణలో విద్యుత్ చార్జీలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలపై మరింత భారం పెరిగింది . సుమారుగా మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లులు చూస్తే ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ప్రజలు వేడుకున్నారు. కాగా తాజాగా విద్యుత్ చార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చం నాయుడు తెలపడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.