ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముందు బాబులకు ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై మద్యం ధరలు తగ్గనున్నాయి. త్వరలోనే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగలు వస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పడంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ఇక ఈ రోజుల్లో కేవలం మగవారు మాత్రమే కాదు యువతులు కూడా మద్యం అనేది బాగానే తాగుతున్నారు. మరి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి శుభవార్త చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రేవంత్ సినీ ఇండస్ట్రీ పై పగబట్టడం చాలా దారుణం : బండి సంజయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11 మద్యం తయారీ కంపెనీలు భారీగా ధరలు తగ్గించునున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూటమి ప్రభుత్వం. బ్రాండెడ్ అని పేరు చెప్పి ధరలనేవి ఎక్కువగా పెట్టినటువంటి కంపెనీలు ఇవాళ ప్రభుత్వం ధరలు తగ్గించమని కోరింది. మద్యం ధరలు అనేవి ఇలా తగ్గాయి. తాజాగా కొద్దిరోజులుగా ప్రభుత్వం మద్యం తయారీ కంపెనీలతో చర్చలు నడిపింది. ఇందులో భాగంగానే ముందుగా మూడు మద్యం కంపెనీలు ధరలను తగ్గించాయి. ఇక ఆ తరువాత భారీగా సేల్స్ పెరగడంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాట పట్టాయి.
టెస్ట్ ప్రాక్టీస్ లో గాయాలు!… జట్టును వీడనున్న రోహిత్, కేఎల్
మద్యం తయారీ కంపెనీలు తాజాగా కొత్త ధరలను ప్రకటించాయి. మద్యం ధరలను తగ్గిస్తూ కొత్త ధరలను ప్రకటించారు. మద్యం తయారీ కంపెనీల నిర్ణయం వల్ల క్వార్టర్ బాటిల్ కొనుక్కున్న వారికి ఏకంగా 30 రూపాయలు తగ్గిస్తున్నారు. అలాగే ఫుల్ బాటిల్ కొండ వారికి 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకు భారీగా ధరలు తగ్గాయి. ఈ కొత్త మద్యం ధరలతో ఇకపై మద్యం షాపులు ఎక్కడున్నా సరే అక్కడ ధరల బోర్డులు అనేవి కనిపిస్తాయి. ఎలాగైతే రైతు బజార్లో షాపులు దగ్గర ధరలు పట్టికను చూసి కొంటున్నాడో అలాగే లిక్కర్ షాపులలో కూడా మద్యం ధరల పట్టికను చూసి కొనుక్కోవచ్చు అని తెలిపారు.
రోడ్ల మీదికి వస్తే తాట తీస్తాం.. హీరోలకు కోమటిరెడ్డి వార్నింగ్