జాతీయం

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు ఎంపికైన మన భారతీయ చిత్రం?

ఈ సంవత్సరం అందించబోయే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులో మన భారతీయ చిత్రం ఎంపిక అవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే భారతీయ చలనచిత్రం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటికే చాలా అవార్డులు తగ్గించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ కు ఎంపిక కావడంతో ఇండియా సినిమా దర్శకులతో పాటుగా నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More : రెడ్ లైట్ ఏరియా గా మారిపోయిన ఎల్బీనగర్!.. జర భద్రం?

తాజాగా ఈ సంవత్సరం అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ లో ఏకంగా రెండు విభాగాల్లో ఈ సినిమా చోటు దక్కించుకోవడం విశేషం. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ ను సాధించింది. ఇక ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించగా నవంబర్ 22వ తారీఖున థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించడంతో నామినేషన్స్ కు ఎంపికయింది.

Read More : పశ్చాత్తాపంతో భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య..?

ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న ఏకైక మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇక భారతదేశం నుండి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్ అవడంతో అందరూ కూడా సినిమా నిర్మించిన దర్శకుడికి అలాగే సినిమాలో నటించిన నటీనటులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More : తండ్రి vs కొడుకు మధ్య గొడవలు!.. నిజమెంత?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button