Wednesday, March 18, 2026
Homeజాతీయంతగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఎంత పలుకుతున్నాయంటే?

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఎంత పలుకుతున్నాయంటే?

Gold Rates Today: ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (జూన్ 17) ఉదయం వీటి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..  దేశంలో బంగారం, వెండి ధరల నిన్న(జూన్ 16) గరిష్ట స్థాయికి చేరాయి. నేడు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,500 పలుకుతోంది. జూన్ 16 నాడు ఈ రేటు రూ.1,01,660గా ఉంది. ఇవాళ రూ.160 తగ్గింది.  అటు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.93,040గా ఉంది. ఇది నిన్న రూ.93,200గా ఉంది. ఇవాళ రూ.160 తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.1,09,800కి పెరిగింది.

ధర పెరుగుదల ఎందుకు?

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 12 నాటి రేట్లతో పోలిస్తే, 24 క్యారెట్ బంగారం రూ. 98,583 నుంచి ఏకంగా రూ.1,01,500కు చేరుకుంది. ఏకంగా రూ.2,917 పెరిగింది. జూన్ 16 నుంచి జూన్ 17 నాటికి మాత్రం రూ.160 తగ్గుదల కనిపించింది. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, డాలర్ విలువలో మార్పులు, చేర్పుల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం విధిస్తున్న పన్నులు, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెప్తున్నారు. ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, స్థానిక డిమాండ్ కారణంగా మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: రైతు భరోసా నిధులు విడుదల.. 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments