
Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,040 పెరిగింది. రూ.1,02,340గా పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.93,810కి చేరింది. అటు వెండి ధర కిలోకు రూ.1,000 పెరిగింది. రూ.1,19,100కు చేరుకుంది.
ఆయా నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే?
ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,02,340గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810కు చేరింది. వెండి ధర కిలోకు రూ.1,19,100గా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,490 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,960గా ఉంది. ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.1,19,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810గా పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810గా ఉంది.
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న సుంకాలు కూడా మార్కెట్ ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్ పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
Read Also: అత్తింటి వేధింపులు అబద్దమేనా? మహిళా ఐపీఎస్ పై సుప్రీ ఆగ్రహం!