Wednesday, March 18, 2026
Homeతెలంగాణలక్ష దాటిన బంగారం ధర.. హైదరాబాద్ లో ఎంత పలుకుతుందంటే?

లక్ష దాటిన బంగారం ధర.. హైదరాబాద్ లో ఎంత పలుకుతుందంటే?

Gold Rate Today: బంగారం ధర రోజు రోజుకు మరింత పెరిగుతోంది. ఒక్క అడుగు వెనక్కి పది అడుగులు ముందుకు అన్నట్లు సాగుతోంది. వారం రోజుల క్రితం వరకు 97 వేలకు కాస్త అటు ఇటుగా ఉండగా, ఇప్పుడు మళ్లీ లక్ష క్రాస్ చేసింది.   10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,950కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,400 పలికింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,050 దగ్గర ట్రేడ్ అయింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వాళ్లు మంచి లాభాలను పొందుతున్నారు.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

భాగ్యనగరంలో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిన్న(శుక్రవారం)10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,400గా ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.10  పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,410కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,960 పలుకుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 76,060గా కొనసాగుతోంది. ఆయా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా మంది బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం విలువ అమాంతం పెరుగుతోంది. బంగారం మీద పెట్టుబడి సేఫ్ కావడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

Read Also: ఇంటి పక్కనే క్వింటాల్ బంగారం, మీరెలా నమ్మారు రా?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments