
Gold Rate: బంగారం ధరలు ఈ మధ్య కాలంలో పసిడి ప్రేమికులకు ఏ మాత్రం ఉపశమనం కలిగించట్లేదు. గత కొన్ని నెలలుగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటి పైస్థాయిలోనే నిలిచిపోవడంతో, ప్రజలు బంగారం కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. నిన్న కొద్దిగా తగ్గిన ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్‌లో నమోదైన తాజా రేట్లు చూస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మరింతగా ₹710 పెరిగి మరోసారి కొత్త గరిష్ట స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹650 పెరిగింది. ఈ పెరుగుదలతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,460 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,750గా నమోదైంది. ధరలు తగ్గుతాయని ఆశించిన కుటుంబాలు మరింత నిరాశ చెందుతున్నాయి.
ఇక వెండి ధరలు కూడా అదే ధోరణిలో పెరగడం గమనార్హం. నవంబర్ 25 నుంచి నేటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర పూర్తిగా రూ.12,000 పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే వెండి ధర కిలోకు రూ.3,000 పెరిగి మొత్తం రూ.1,83,000కి చేరింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి మాత్రమే కాదు, ప్లాటినం ధర కూడా వరుసగా పెరుగుతూనే ఉంది. నిన్న 10 గ్రాముల ప్లాటినం ధర రూ.1,740 పెరిగినప్పటికీ, ఈరోజు మరో రూ.980 పెరగడంతో ప్రస్తుత ధర రూ.47,200కి చేరింది.
ఇక ఈ సమయంలో శుక్ర మౌఢ్యమి ఉన్నందున పెళ్లిళ్లకు అన్ సీజన్ అయినప్పటికీ, కొన్నాళ్లలో తిరిగి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు ముందుగానే బంగారం కొనాలని భావించినా, ధరలు అదుపు తప్పి పెరుగుతుండటంతో ఎవరికీ కొనుగోలు ధైర్యం రావడం లేదు. పండుగలు, శుభకార్యాలు దగ్గరపడే కొద్దీ ధరలు తగ్గుతాయేమోనని ఆశించిన పసిడి ప్రియులందరూ ఇప్పుడు ధరలు మరింత భారమవుతుండటంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Sri Lanka: ప్రకృతి విపత్తుతో పోరాడుతోన్న శ్రీలంక.. 56కి చేరిన మృతుల సంఖ్య





