
Gold prices:ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్న సమయంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం మరోసారి తన ప్రాధాన్యత చాటుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడడం, అమెరికా లేబర్ మార్కెట్‌లో బలహీన సంకేతాలు కనిపించడం, ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేటు తగ్గించే అవకాశం పెరిగిపోవడం వంటి అంశాలు బంగారం ధరలకు బలమైన మద్దతునిస్తున్నాయి. శుక్రవారం ప్రపంచ బులియన్ మార్కెట్‌లో కనిపించిన అస్థిరత తర్వాత, సోమవారం సెషన్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికాలో ఆరు వారాల పాటు కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఆర్థిక డేటా విడుదల ఆలస్యం కావడం కూడా ఇన్వెస్టర్‌లను బంగారం వైపు మళ్లించింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుదల కనిపించినప్పటికీ భారతీయ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.28 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.25, 18 క్యారెట్ల ధర రూ.21 తగ్గింది. 100 గ్రాముల ధరలు కూడా తగ్గుదల దిశగా సాగాయి. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం రూ.2,800లు తగ్గగా, 22 క్యారెట్ల బంగారం రూ.2,500లు, 18 క్యారెట్ల బంగారం రూ.2,100 రూపాయలు తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా ఇదే తగ్గుదల ట్రెండ్ నమోదు అయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,30,200లకు ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,350లుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం రూ.97,650 వద్ద ఉంది. చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా భిన్నంగా ఉండి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,31,350లకు, 22 క్యారెట్లది రూ.1,20,400లకు ట్రేడ్ అయింది.
దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో కూడా ధరలు సాధారణంగా సమానంగా కదులుతున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, విశాఖపట్నం వంటి కేంద్రాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,30,200 నుంచి రూ.1,30,350 మధ్యలో ఉండగా, 22 క్యారెట్లది రూ.1,19,350 నుంచి రూ.1,19,500 ల మధ్య ఉంది. ఈ తగ్గుదల తాత్కాలికమా లేక మరింత కాలం సాగుతుందా అన్నది ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ బలహీనత, అంతర్జాతీయ జియోపాలిటికల్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
NOTE: ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
ALSO READ: Electric Car: కార్లలోకెల్లా అత్యంత చౌకైన కారు ఇదే.. ఇంకెందుకు ఆలస్యం కొనేయండి మరి!





