Saturday, February 28, 2026
Homeజాతీయంభ‌గ్గుమంటున్న బంగారం ధ‌ర‌లు

భ‌గ్గుమంటున్న బంగారం ధ‌ర‌లు

  • పుత్త‌డి కొన‌లేక కుదేల‌వుతున్న సామాన్యుడు

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: బంగారం ధ‌ర‌లు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డం భ‌విష్య‌త్‌లో సామాన్యుడు బంగారం కొన‌లేని ప‌రిస్థితులు రాబోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం విన‌బడుతుంది. అస‌లే పెళ్లి సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనాలంటే సామాన్య ప్ర‌జ‌లు బెంబెలెత్తి పోతున్నారు.

రెండు రోజులుగా స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు శ‌నివారం అమాంతంగా పెరిగిపోయాయి. ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,64,730లకు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.3,160ల మేర పెరిగింది.

ఇక 22 క్యారెట్ పసిడి ధర కూడా రూ.2,900ల మేర పెరిగి రూ.1,51,000లకు చేరుకుంది. నగరంలో వెండి ధర కూడా రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.3 లక్షలుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా రూ.1,65,820కు చేరింది.

ముంబై, కర్ణాటక, బెంగళూరు నగరాల్లో మేలిమి బంగారం ధర రూ.1,64,730గా ఉంది. ఢిల్లీలో రూ.1,64,880ల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర (10 గ్రాములు) చెన్నైలో రూ.1,52,000గా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,51,000 వద్ద కొనసాగుతోంది. నగరాల వారీగా వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ప్రస్తుతం రూ.3 లక్షలకు చేరుకుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments