
Gold and Silver Prices: గత వారం వరకు పెరిగిన బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.99,810గా పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.91,490గా ఉంది. అటు వెండి ధర కిలోకు రూ.2,000 తగ్గి రూ.1,12,900కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇంచుమించు ఈ ధరల తగ్గుదల కనిపించింది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రాష్ట్ర హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490గా పలుకుతోంది. వెండి కిలో ధర రూ.1,22,900గా ఉంది. దేశ రాజధానికి ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధ రూ.99,960, 22 క్యారెట్ల బంగారం రూ.91,640, కిలో వెండి ధర రూ.1,12,900గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ బంగారం రూ.99,810, 22 క్యారెట్ బంగారం రూ.91,490, వెండి రూ.1,12,900గా పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ బంగారం రూ.99,810, 22 క్యారెట్ బంగారం రూ.91,490, వెండి రూ.1,22,900గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ బంగారం రూ.99,810, 22 క్యారెట్ బంగారం రూ.91,490, వెండి రూ.1,12,900గా కొనసాగుతోంది. బంగారం ధరలు సాధారణంగా డాలర్ లో లెక్కిస్తారు. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.
Read Also: జీతం రూ. 15 వేలు.. ఆస్తి రూ. 30 కోట్లు!