
Today Gold-Silver Rates: గత కొద్ది రోజులుగా భారీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. లక్షకు పైగా ఎగబాకిన గోల్డ్ రేట్.. ఇప్పుడు రూ. 98 వేలకు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98 వేలు పలుకుతుంది. గత వారం క్రితం ఈ ధర రూ. 99 వేలు పలికింది. నెమ్మదిగా తగ్గి రూ. 98 వేలకు చేరింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హైదరాబాద్ బంగారం ధరలు
హైదరాబాద్ లో నిన్న (శనివారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,830 పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,600గా ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 90,600 పలికింది. ఈ రోజు కూడా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ నిపుణులు తెలిపారు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,830 దగ్గర కొనసాగుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,600 పలుకుతోంది.
హైదరాబాద్ లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 100 గ్రాముల వెండి ధర రూ. 12,000 పలుకుతుంది. కేజీ వెండి ధర రూ.1,20,000గా పలుకుతోంది. ఈ రోజు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు. 100 గ్రాముల వెండి ధర రూ. 12,000గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,20,000గా ఉంది.
Read Also: తెలంగాణలో భారీ వర్షాలు.. ఇవాళ ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?