
Gold And Silver Rate: బంగారం ధరలు రోజు రోజుకు రాకెట్ లా దూసుకెళ్తున్నాయి. లక్ష రూపాయలకు కాస్త అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. బంగారం మీద పెట్టుబడి సేఫ్ కావడంతో ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గోల్డ్ రేట్ కు రెక్కలు వస్తున్నాయి. గురువారం నాడు హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,330 పలికింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91.050గా కొనసాగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500 దగ్గర ట్రేడ్ అయ్యింది.
నిన్నటితో పోల్చితే పెరిగిన బంగారం ధర
ఇక నిన్నటితో పోల్చుకుంటే తులం బంగారంపై రూ. 10 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,060గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,510 దగ్గర ట్రేడ్ అవుతోంది
వెండి ధరల్లోనూ మార్పులు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గురువారం నాడు హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1, 24,000 పలికింది. ఇవాళ కిలో వెండి ధర రూ. 1,23,900గా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే వెండి ధర కిలోకు రూ. 100 తగ్గింది. ఎక్కువగా ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వెండి ధరలు కాస్త తగ్గినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: కొనసాగుతున్న వరద.. నాగార్జునసాగర్ ఎంత నిండిందంటే?