
Gold Rate: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.99,370కి చేరుకున్నది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలతో పాటు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో కిలో వెండి ధర ఏకంగా రూ. 1,500 పెరిగింది. ప్రస్తుతం రూ. 1,05,500కు చేరుకుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99, 000 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90, 750కి చేరింది. కిలో వెండి ధర రూ. 1, 08, 300కి పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలంలో బంగారం, వెండి ధరలకు కాస్త అటు ఇటుగా ఉంది.
ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సుంకాల విధింపులతో పాటు ఆయా దేశాల్లో వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో విలువైన లోహాల ధర పెరిగింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మీద 25 శాతం, కెనడా మీద 35 శాతంతో పాటు ఇతర దేశాల మీద 15 నుంచి 20 శాతం దిగుమతి సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ఔన్స్ బంగారం ధర 24.63 డాలర్లు పెరిగి, 3,348 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 1.64 డాలర్లు పెరిగి, 37.61 డాలర్లు పలుకుతుంది.
Read Also: మందు బాబులకు బ్యాడ్ న్యూస్, రెండు రోజులు వైన్స్ బంద్!