
Gold Silver Rate Today: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. వేడుక ఏదైనా ఒంటి నిండా బంగారు నగలు వేసుకోవాలి అనుకుంటారు. పెట్టుబడి దారులు సైతం బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అనుకుంటారు. అందుకే, బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. పసిడితో పాటు వెండి ధరలకు కూడా భారీగానే పెరుగుతున్నాయి. అందుకే, బంగారం, వెండి ధరలను మహిళలతో పాటు ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 99,440గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,09, 817గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 96,415 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,700గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,10,600గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,820 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర, 89,990గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,12,0000గా ఉంది.
పసిడి ధర తగ్గుతుందా?
ఇక బంగారం, వెండి దరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉంటాయి. అక్కడ ధర పెరిగితే, ఇక్కడ కూడా పెరుగుతుంది. అక్కడ తగ్గితే, ఇక్కడా తగ్గుతుంది. డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. మరికొద్ది వారాల్లో బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.
Read Also: శ్రీ రాముడు పుట్టింది ఎక్కడ? నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!