
Gold Price Today: పసిడి ధర రోజు రోజుకు మరింత పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా మూడున్నర వేలకు పైగా పెరిగింది. రికార్డు స్థాయికి బంగారం ధర చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,600 పెరిగి రికార్డు స్థాయి చేరింది. తుల ధర రూ.1,02,620కి చేరింది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి, కిలోకు రూ.1.14 లక్షలకు చేరింది.
హైదరాబాద్ లో బంగారం ధర ఎంత అంటే?
హైదరాబాద్‌లోనూ పసిడి ధర రూ.320 పెరిగి, రూ.1,02,550కు చేరింది. కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1.27లక్షలకు చేరింది. ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది మదుపరులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోళ్లకు దిగారు. డాలర్ తో పడిపోతున్న రూపాయి మారకం రేటూ బంగారం ధర పెరిగేందుకు కారణం అవుతుంది.
Read Also: రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!