
Gold and Silver Prices: గత కొద్ది రోజులులగా పరుగులు తీసిన బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఒకానొక సమయంలో రూ. లక్ష మార్క్ ను దాటి వెళ్లగా.. ఇప్పుడు రూ. లక్ష దిగువకు పడిపోయింది. పసిడి ధర నిన్నటితో పోల్చితు ఇవాళ కాస్త తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,810గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,490గా నమోదయ్యింది. వెండి ధర కిలోకు రూ. 1, 15,900గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,960, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,640, కిలో వెండి ధర రూ.1,15,900గా కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900గా పలుకుతోంది.
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయంటే?
గత వారం వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మూడు, నాలుగు రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక విధానాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారం ధరలు తగ్గేలా చేశాయి.