Wednesday, March 18, 2026
Homeజాతీయంత‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు...

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి ఒక‌రోజు త‌గ్గుతూ మ‌రొక రోజు పెరుగుతూ ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు క‌నిపిస్తూనే ఉన్నాయి. కాగా మంగ‌ళ‌వారం ధ‌ర ఒక్క‌సారిగా అమాంతం పెరుగ‌గా బుధ‌వారం మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు తగ్గాయి. వేస‌వి సీజ‌న్ పెళ్లీలు, శుభ‌కార్యాలు ఉన్న నేప‌థ్యంలో కొనుగోలు త‌గ్గుతూ పెరుగుతున్న ధ‌ర‌ల‌ను తెలుసుకొని కొనుగోలు చేయాల‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

కాగా బుధవారం ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.330 మేర పసిడి ధర తగ్గింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే.. ఈ రోజు రూ.300 మేర తగ్గింది. దీంతో 10 క్యారెట్ల ఈ బంగారం ధర రూ.1,44,600గా ఉంది.

హైదరాబాద్ మహానగరంలో కిలో వెండి ధర సైతం రూ.5 వేల వరకు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. మంగళవారం ఇదే కిలో వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ. 5 వేలు తగ్గ‌డం గ‌మ‌న‌ర్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments