
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవాళ గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న మనందరికీ తెలిసిందే. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఇక తాజాగా పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ అన్ని నియమాలు సక్రమంగా పాటిస్తున్నారో లేదో తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలో ఉందో లేదో అని ఎంక్వయిరీ చేశారు.
Read More : ముఖ్యమంత్రి పర్యటనను విజవంతం చెయ్యాలి…ఎంపీ మల్లురవి
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పి శరత్ చంద్ర కీలక సూచనలు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం దుకాణాలు మరియు బార్ అండ్ రెస్టారెంట్లు తెరవకూడదని ఎస్పీ హెచ్చరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా సునాయసంగా శాంతి భద్రతంగా.. ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎన్నో రోజుల నుంచి వేచియున్న ఈ ఎన్నికలు ఇవాళ ముగియనున్నాయి. కాగా ఎన్నికలలో ఏ పార్టీ నేతలు విజయం సాధిస్తారు అని ఉత్కంఠత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిలోనే ఉంది. ఇక ముఖ్య పార్టీల మనసులో అయితే భయం ప్రారంభమైంది.
Read More : కాంగ్రెస్ మూర్ఖుల్లారా… గోదావరి ఎలా పారుతుందో కళ్ళు తెరిచి చూడండి : హరీష్ రావు