Wednesday, February 25, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారు అండా

పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారు అండా

  • అధికారంలోకి వ‌స్తే గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారు అండగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. బుధ‌వారం మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌తో భాగ్య‌లక్ష్మీ ఆల‌యానికి మొక్క‌లు తీర్చ‌కునేందుకు వ‌చ్చారు. ఈసంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ మహాశక్తి అమ్మవారి, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే తట్టుకుని కరీంనగర్ లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామ‌న్నారు. భాగ్య లక్ష్మీ అమ్మ‌వారు చాలా ప‌వ‌ర్‌ఫుల్ అని బీజేపీ అధికారంలోకి వ‌స్తే భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యాన్ని స్వ‌ర్ణ‌దేవాల‌యం త‌ర‌హాలో గోల్డెన్‌టెంపులుగా మారుస్తాన‌న్నారు.

భాగ్య‌లక్ష్మీ అమ్మ‌వారి ఆశీస్సుల‌తో ప్ర‌జా సంగ్రామం యాత్ర‌ను ప్రారంభించి కేసీఆర్ దాడుల‌ను త‌ట్టుకొని యాత్ర‌ను దిగ్విజియంగా పూర్తి చేశాన‌న్నారు. హైదరాబాద్ లో హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా అడ్డుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామ‌న్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మా బూట్లు నాకాల్సిందేనని మజ్లిస్ నేతలు చెబుతున్నారంటే సిగ్గుండాల‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలైంది నాటి నుండి నేటి వరకు దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మొదలు సంతోష్ నగర్ భూలక్ష్మీ, బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి, శంషాబాద్ ఆలయాలపై దాడులు జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని అన్నారు.

గోహత్యలు, లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలపై డ్రగ్స్ ఇస్తూ అత్యాచారాలు చేస్తున్నా స్పందించరా? హిందూ ధర్మాన్ని కాపాడాలనే సంకల్సంతో కసితో మేం పనిచేస్తున్నామ‌న్నారు.హిందూ సమాజం జాగ్రుతం కాకపోతే అందరవి బిచ్చపు బతుకులే అవుతాయ‌న్నారు. హనుమాన్, అయప్ప, భవానీ మాల వేసుకుంటే సెలవు ఇవ్వరు.

మాల వేసుకున్న పిల్లలను కూడా స్కూలుకు రానీయ్యడం లేదు. అయినా భరిస్తూ ఉందామా అని ప్ర‌శ్నించారు. బాన్సువాడలో ఎంఐఎం పార్టీ నేతలు హిందువులపై రాళ్ల దాడి చేసినా పట్టించుకోరా? అని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. దాడికి కార‌కులైన వారిని వ‌దిలి హిందువుల‌ను అరెస్టు చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

పోలీసులు మీరు వెంటనే అక్రమ అరెస్టలు ఆపండి.. దాడులు చేసిన ఎంఐఎం గూండాలను వెంటనే అరెస్ట్ చేస్తారా? లేదా? లేనిపక్షంలో నేనే స్వయంగా బాన్సువాడకు వెళతా హిందువులకు రక్షణ కవచంగా నిలుస్తానని అన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments